26 జన, 2010

బౌధ్ధ మత ప్రభావం

బౌధ్ధ మతం భారతీయుల సంస్కృతిపై చెరగని ముద్ర వేసింది. బౌధ్ధం యొక్క ప్రభావం ఎల్లెడలా కనిపిస్తుంది.భారతీయులు ధర్మ సూత్రాల సారాన్ని జీర్ణంచుకున్నారు. జీవితంపట్ల కొత్త దౄక్పధం,జంతువులపట్ల దయ,బాధ్యతాయుతమై న నియమబధ్ధమైన నడవడి,ఉన్నత ఆశయాల కోసం దృష్టి ని సారించడం వంటి మంచి లక్షణాలు బౌధ్ధ మతంనుండి భారతీయుల కు లభించి నవి.

21 అక్టో, 2009

వ్యవస్థ

వ్యవస్థలు ఎప్పుడూ వ్యక్తులకంటే గొప్పవి.అందుకే వ్యవస్థ శాశ్వతం.వ్యక్తి అశాశ్వతం.. ఈమాట అక్షర సత్యం. వ్యవస్థ వలన వ్యక్తికి గుర్తింపు వస్తుంది. ఆ వ్యవస్థ మీద ఉన్న గౌ రవం కొద్దీ ఆ వ్యక్తిని కూడ మనం గౌ రవిస్థూ ఉంటాం. ఆ వ్యవస్థకు అంత గొప్ప పేరు రావటానికి గల కారణమేమిటి? వ్యక్తుల కృషె వలన వ్యవస్థలకు లేదా సంస్థలకు గుర్తింపు వస్తుంది.ఇలా వ్యవస్థకు మ.చి గుర్తింపు తెచ్చే వ్యవక్తులు కావాలి.కనుక వ్యక్తికి వ్యవస్థకు పేరు తెచ్చే సత్కార్యాలను మాత్రమే చేయాలి.

9 అక్టో, 2009

వే దిక

పిల్లల అవగాహనా శక్తిలో ,మేధోశక్తిలో ఎన్నో అంతరాలుంటాయి శక్తులు కూడా అన్ని సందర్భాలలో ఒకే లా ప్రతిస్పందించవు.వారి సామర్థ్యం పరిమితిని తల్లిదండ్రులు సరిగ్గా అంచనా వేయగలగాలి.సరియైన గమ్యాలని నిర్ణయించుకోడంలో వారికి చేయూత నివ్వాలి,లేనంత కాలం తల్లీండ్రులకు మనోవ్యాకులత తప్పదు. పిల్లలు మన హోదాకు చిహ్నాలు కాదు.తల్లిదండ్రులు అణqచివేసుకొన్న , కోరికలకు పిల్లలు వేదిక కాకూడదు.

2 అక్టో, 2009

స్వాధ్యాయం

స్వాధ్యాయం అంటే--స్వ అధ్యయనం అంటే మనల్ని మనం విశ్లేషించుకోవడం . ఆత్మ పరిశీలన లేని జీవితం జీవితమే కాదు అంటారు సోక్రటీస్.మనిషి అన్ని దశలలోను తనను తాను పరిశీలన చేసుకోవదం ద్వారా తనలోని లో పాలను సవరించుకొనే అవకాశం కలుగుతుంది. మనస్సులో వచ్చే ఆలోచనలకు క్రియారూపం ఇవ్వకుండా ప్రతిరోజూ గమనించడమే ఆత్మపరిశీలన.ఈ ఆత్మపరిశీలన మానసికంగా బలవంతులను చేస్తుంది.జీవిత పోరాటానికి సంసిథ్థం చేస్తుంది. మన ఆలోచనలే మన ప్రస్తుత స్ధికి కారణం. అందువల్ల ఆలోచనల విషయంలో జాగరూకత అవసరం.

15 సెప్టెం, 2009

కాలం gurinchi

లక్ష్యాలు,గమ్యాలు లేని జీవనవిధానానికి కాలం సరిపోదు. మన అలవాట్లు కాలం విలువను నిర్ణయిస్తాయి.ప్రతివారి అవసరాలమేరకు కాలం దొరుకుతుంది కనుక వైఖరిలో మార్పు వస్తే తప్ప కాలం విలువలో మార్పు రాదు .కాలాన్ని సద్వినియోగం చేసుకోదానికి పరిమితులు లేవు . కాలం పట్ల మన అభిప్రాయాల్ని మార్చుకుంటే తప్ప రానున్న కాలంలో ఇమడలేము.భవిష్యత్తులో సవాళ్ళ ను ఎదుర్కోవాలంటే కాలం విలువను పెంచుతూ మన విలువను పెంచుకోవాలి.

8 సెప్టెం, 2009

కాలం
కాలం గురించి కాసేపు మాట్లాడు కొందామా
కాలం ఒకటే మన సొంతం. దాన్ని సద్వినియోగం చేసుకొనేవారు సుఖసంతోషాలతో జీవిస్తారు.
తమకు కాలం సరిపోవడ్మ్ లేదనే వారు ముఖ్యంగా ప్రాధాన్యత కల పనులను వాయిదావేసి,
ప్రాముఖ్యం లేని పనులలో కాలం గదుపుతారు.qaalaanni
నిలువ ఉంచలేము.కాలం నదీ ప్రవాహంలాంటిది.దాన్ని డబ్బు లాగా దాచలేం. మరిన్ని వివరాలు మరోసారి చెప్పుకుందాము.

6 సెప్టెం, 2009

prapancham

మీరు ఉన్నతంగా ఎదగడానికి మీకు ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తరువాత ప్రపంచానికి మీరు కావాలి. కనుక ప్రపంచం మీ kosam ఎదురుచూసేలా మీరు ఎదగాలి.